ఎడ్లపాడు: మండల పరిధిలోని కొండవీడు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా, పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ సహకారంతో కొ...
ఎడ్లపాడు: మండల పరిధిలోని కొండవీడు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా, పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ సహకారంతో కొండవీడు కోటలో రాత్రిపూట టెంట్ వసతి సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా అధికారులు, ఉద్యోగులతో పాటు వారి ద్వారా వచ్చే 10 మంది సభ్యుల బృందాలకు రాయితీపై ఈ సదుపాయం కల్పించనున్నారు. ఈ అడ్వెంచర్ క్యాంపింగ్‌ను 'ఔట్రివిల్ అడ్వెంచర్స్' ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు ముందస్తు ఏర్పాట్ల కోసం ప్రతినిధులు ఆశ దళవాయి (90005 93392) లేదా సతీష్ దళవాయి (99660 56126) ను సంప్రదించాలని అధికారులు కోరారు.
COMMENTS