చిలకలూరిపేట: పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ...
చిలకలూరిపేట: పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ అబ్దుల్ రహీం ముఖ్యఅతిథిగా పాల్గొని, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రగతిలో అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికే కాకుండా, దేశంలోని ప్రతి పౌరుడి హక్కుల కోసం ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయమని , కార్మికుల హక్కుల కోసం ఆయన తీసుకొచ్చిన 'లేబర్ యాక్ట్' నేటికీ ఎంతో మందికి రక్షణగా నిలుస్తోందని పేర్కొన్నారు.భారత రాజ్యాంగం ద్వారా ఆయన అందించిన ఫలాలు వర్ణనాతీతమని, అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అబ్దుల్ రహీం ఆయన తెలిపారు. వీరితోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ ఉద్యోగస్తులు, సచివాలయ అడ్మిన్లు, కాంట్రాక్టర్లు, తదితరులు ఉన్నారు.
COMMENTS