చిలకలూరిపేట: అసిస్ట్ సంస్థ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సేవా తత్పరులు అయిన జాస్తి రంగారావుకు ప్రభుత్వం నుంచి ఉగాది పు...
చిలకలూరిపేట: అసిస్ట్ సంస్థ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సేవా తత్పరులు అయిన జాస్తి రంగారావుకు ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం లభించడం నియోజకవర్గానికే గర్వకారణమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు.
గురువారం విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది సేవా పురస్కారం పొందిన పట్టణానికి చెందిన జాస్తి రంగారావును. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి, నియోజకవర్గ టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియచేశారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. రంగారావు సేవా ధృక్పథం.. సామాజిక సేవా స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా చేయూత నందించడంలో ఆయన చేస్తున్న కృషికి నేడు ముఖ్యమంత్రి చేతులుమీదుగా ప్రభుత్వ ఉగాది పురస్కారం లభించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, జిజిహెచ్ సూపర్డెంట్ యశస్వి రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS