సాధారణ కానుపు లో మగ బిడ్డ... డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో సుఖ ప్రసవం..... చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పి...
సాధారణ కానుపు లో మగ బిడ్డ...
డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో సుఖ ప్రసవం.....
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో ఒక గర్భిణీకి అత్యంత సురక్షితంగా సాధారణ నార్మల్ డెలివరీ జరిగింది. ప్రస్తుత కాలంలో సిజేరియన్లు అధికమవుతున్న తరుణంలో, డాక్టర్ సుష్మ గర్భిణీకి ధైర్యం చెప్పి సుఖ ప్రసవం జరిగేలా చూడటం విశేషం.
తొలి కాన్పులోనే మగ శిశువు....
సదరు మహిళకు ఇది మొదటి కాన్పు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య బృందం తీసుకున్న జాగ్రత్తల వల్ల ఆమెకు మగ బిడ్డ జన్మించాడు. మొదటి సంతానంగా మగ బిడ్డ కలగడంతో ఆ కుటుంబంలో ఆనందహేల నెలకొంది.
ఆరోగ్యంగా ఉన్న తల్లీబిడ్డలు - శిశువు బరువు 2.6 కిలోలు...
జన్మించిన శిశువు 2.6 కిలోల బరువుతో ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ లావు సుష్మ తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్లకు మరియు హాస్పిటల్ సిబ్బందికి ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
COMMENTS