పల్నాడు: జిల్లాలో పన్ను ఎగవేతలను అరికట్టాలని, చట్ట ప్రకారం ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రతి ఒక్క రూపాయి వసూలయ్యేలా చూడాలని జిల్లా ...
పల్నాడు: జిల్లాలో పన్ను ఎగవేతలను అరికట్టాలని, చట్ట ప్రకారం ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రతి ఒక్క రూపాయి వసూలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జీఎస్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో అన్ని శాఖల అధికారులు పన్ను వసూళ్ల విషయంలో పన్నుల శాఖకు సహకరించాలన్నారు.శాఖల వారీగా వ్యాపారాలలో ఉన్న సంస్థల వివరాలు పన్నుల శాఖకు ఇవ్వాలన్నారు. ఆయా సంస్థలు సక్రమంగా పన్నులు చెల్లించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలం వ్యాపారంలో కొనసాగలరని స్పష్టం చేయాలన్నారు.ఈ సమావేశానికి గుంటూరు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్ పాత్రో, డిప్యూటీ కమిషనర్ జి మురళీకృష్ణ, ఎల్డీఎం రామ్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
COMMENTS