చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక అత్యంత ...
చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. అసాధారణ గర్భాశయ రక్తస్రావం (AUB) సమస్యతో బాధపడుతున్న ఒక మహిళకు టోటల్ లాపరోస్కోపిక్ హిస్టెరెక్టమీ (TLH) ద్వారా గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్సను వైద్యులు నిర్వహించారు.సదరు మహిళ గత కొంతకాలంగా గర్భాశయ సమస్యలతో పాటు మధుమేహం హైపోథైరాయిడిజం, బ్రోన్చియల్ ఆస్తమా మరియు తీవ్రమైన రక్తహీనత వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఇన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, డాక్టర్ లావు సుష్మ నేతృత్వంలోని వైద్య బృందం అత్యాధునిక లాపరోస్కోపిక్ విధానంలో ఎంతో చాకచక్యంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ సుష్మను రోగి బంధువులు అభినందించారు.
COMMENTS