చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోయిన 10 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ...
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోయిన 10 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ట్రేస్ చేసిన పోలీసులు, శనివారం నాడు చిలకలూరిపేట అర్బన్ సి.ఐ పి. రమేష్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని లేదా CEIR పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
COMMENTS