ఎడ్లపాడు: యడ్లపాడు మండల స్థానిక సమాఖ్యలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆర్. నాగలక్ష్మి అధ్యక్షతన జెండర్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ...
ఎడ్లపాడు: యడ్లపాడు మండల స్థానిక సమాఖ్యలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆర్. నాగలక్ష్మి అధ్యక్షతన జెండర్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా జెండర్ ప్రతిజ్ఞ చేయించారు.లింగ వివక్షత గురించి చర్చించిన తర్వాత, పిడి డిఆర్డిఏ ఘన్సీరాణి జెండర్ సబ్-కమిటీలకు బాధ్యతలు అప్పించారు. సమాజంలో మహిళలపై జరిగే హింస, మహిళా చట్టాలు గురించి అవగాహన కల్పించారు. గ్రామ సంఘాల సభ్యులు జెండర్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాలని ఒకరు ఒకరు సూచించుకున్నారు.మహిళలు ఉద్యోగం చేసే కార్యాలయాల్లో ఖరాభుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా చట్టాలపై వివరాలు చెప్పారు. హెల్ప్‌లైన్ నంబర్ 181కి కాల్ చేస్తే పోలీసులు స్పందించి కేసు నమోదు చేస్తారని తెలిపారు.పల్నాడు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్-2006 గురించి వివరించారు. కుటుంబంలో మహిళల పాత్రపై కూడా దృష్టి సారించారు. యడ్లపాడు మండలంలోని అన్ని గ్రామ సంఘాల్లో జెండర్ అజెండా పెట్టి చర్చించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆర్. నాగలక్ష్మి, సెక్రటరీ శ్రీలక్ష్మీ, అమాసమ్మ, ఏపీహెచ్ కె. రవీంద్రకుమార్, సీసీలు వై. పెద్దయ్య, సిహెచ్. నాగేశ్వరరావు, జి. నాగేశ్వరరావు, హెచ్. ద్రాక్షాయమ, ఎం.ఎస్.ఏ. ఫిలిప్ కుమార్, అన్ని గ్రామాల వీఓలు, గ్రామ సంఘాల అధ్యక్షులు, జెండర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
COMMENTS