చిలకలూరిపేట: పట్టణంలోని పెదనందిపాడురోడోలో, రహమత్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగ...
చిలకలూరిపేట: పట్టణంలోని పెదనందిపాడురోడోలో, రహమత్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్థానిక ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మరియు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు..
బాబు కొట్టు వద్ద ,*S.B.I, A.T.M* దగ్గర ఉన్న కల్వర్టులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి, నీరు నిలిచిపోయి దుర్వాసన వెలువడుతుంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు పోయి ఇప్పుడు కల్వర్టు అడుగు భాగం వరకు, నీటి పారుదల పూర్తిగా నిలిచిపోయింది.
దోమల ఉధృతితో వృద్ధుల ఆవేదన...
సాయంత్రం వేళల్లో చల్లగాలి కోసం బయట కూర్చునే వృద్ధులకు ఈ మురుగు నీటి వల్ల పెరిగిన దోమలు శాపంగా మారాయి. మురుగు కాలువల వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి, రకరకాల రోగాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్...
పారిశుధ్య లోపం వల్ల వ్యాధిగ్రస్తం కాకముందే ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. కల్వర్టు కింద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని కోరుకుంటూనారు.
COMMENTS