ఉప్పరపాలెం గ్రామ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్న వైసీపీ కార్యకర్తలు.. ...
ఉప్పరపాలెం గ్రామ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్న వైసీపీ కార్యకర్తలు..
యడ్లపాడు: మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన 40 వైసీపీ కుటుంబాలు గురువారం ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీని నమ్ముకొని ప్రతి ఎన్నికలో గెలుపుకోసం కష్టపడి పనిచేశామని, తమ ప్రభుత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకున్న తమ ఆలోచనలు కార్యరూపం దాల్చనందునే వైసీపీని వీడి, టీడీపీలో చేరామని ఉప్పరపాలెం గ్రామ మాజీ వైసీపీ కార్యకర్తలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తానని, కూటమిప్రభుత్వంలో గ్రామస్తులు అందరూ పార్టీలు, వర్గాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఈ సంద్భంగా ప్రత్తిపాటి సూచించారని తాజాగా టీడీపీలో చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, కళ్యాణ చక్రవర్తి, వీర్ల అంకమ్మ, డేరంగుల శంకర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS