చిలకలూరిపేట: బస్టాండ్‌లో బస్సుల రాక కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాట...
చిలకలూరిపేట: బస్టాండ్‌లో బస్సుల రాక కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండాల్సిన నరసరావుపేట - చిలకలూరిపేట రూట్‌లో, ప్రస్తుతం గంట దాటినా బస్సు జాడ లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు గుంటూరు వైపు వెళ్లే ప్రయాణికులు కూడా సుమారు 45 నిమిషాలకు పైగా వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం చిలకలూరిపేట రాజాపేటలో 'తండ్రి సన్నిధి మహాకూటమి' సభలు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉన్న తక్కువ బస్సుల్లోనే జనం పరిమితికి మించి ఎక్కడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ మహాకూటమి ముగిసే వరకు అయినా ఆర్టీసీ అధికారులు స్పందించి, అదనపు బస్సులు మరియు ప్రత్యేక సర్వీసులను నడపాలని స్థానికులు, ప్రయాణికులు కోరుకుంటున్నారు.
COMMENTS