చిలకలూరిపేట స్థానిక గణపవరం గ్రామంలో గత వారం రోజుల నుండి యువకులు చమటోర్చి కష్టపడి కోటప్పకొండకు ప్రభను సిద్ధం చేస్తున్నారు. గణపవరం...
చిలకలూరిపేట స్థానిక గణపవరం గ్రామంలో గత వారం రోజుల నుండి యువకులు చమటోర్చి కష్టపడి కోటప్పకొండకు ప్రభను సిద్ధం చేస్తున్నారు. గణపవరంలోని ప్రజల సహకారంతో పార్టీలకు అతీతంగా ప్రప్రధమముగా గ్రామ ప్రభను ఏర్పాటు చేస్తున్నారు .ఈ సందర్భంగా నాదెండ్ల లో కొలువై ఉన్నటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పూజలు చేసి కోటప్పకొండకు ముస్తాబవుతున్నటువంటి గ్రామ ప్రభను అత్యంత భక్తిశ్రద్ధలతో భాజా భజీంత్రీలతో డప్పుల వాయిద్యాలతో కోలాహలంగా శోభాయమానంగా విద్యుత్ కాంతులతో కళ్ళు మిరిమిట్లు కొలిపే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ వంతు బాధ్యతను చేయూతను అందిస్తున్నారు.
గ్రామంలోని పెద్దల సహకారంతో అండదండలతో వారి సూచనల మేరకు మొట్టమొదటిసారిగా కోటప్పకొండకు విద్యుత్తు కాంతితో కూడిన ప్రభను ఏర్పాటు చేయటము గ్రామ ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రభ నిర్వాహ కమిటీ గ్రామంలో ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే కోటప్పకొండకు వెళ్లిన దగ్గర్నుంచి గ్రామానికి వచ్చే వరకు కూడా యువతీ యువకులు వారి యొక్క సహాయ సహకారం అందించవలసినదిగా మరి మరి కోరుతున్నారు
COMMENTS