బరిలో 12,930మంది అభ్యర్థులు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సర్వం సి...
బరిలో 12,930మంది అభ్యర్థులు..
సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పారదర్శకమైన ఎన్నికల కోసం 11,000 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నేడు పోలింగ్ ముగిశాక, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడతాయి. 16వ తేదీన మేయర్, మున్సిపల్ చైర్మన్ల పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం నేడు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది.
COMMENTS