జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అర్బన్ సీఐ రమేష్.. చిలకలూరిపేట: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని, ...
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అర్బన్ సీఐ రమేష్..
చిలకలూరిపేట: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని, స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు.
అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వేడుకల అనంతరం అక్కడకు వచ్చిన చిన్నారులకు ఆయన స్వయంగా చాక్లెట్లు పంపిణీ చేసి వారితో సరదాగా గడిపారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు, ఎస్ఐ హాజరత్తయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
COMMENTS