చిలకలూరిపేట: స్థానిక పట్టణంలోని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో నడుస్తున్న లీలావతి హాస్పిటల్స్‌లో మహిళల ఆరోగ్య స...
చిలకలూరిపేట: స్థానిక పట్టణంలోని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో నడుస్తున్న లీలావతి హాస్పిటల్స్‌లో మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న మహిళల కోసం డయాగ్నస్టిక్ లాపరోస్కోపీ మరియు PCOD డ్రిల్లింగ్ వంటి అధునాతన శస్త్రచికిత్సలను డాక్టర్ సుష్మ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న PCOD సమస్యకు 'ఒవేరియన్ డ్రిల్లింగ్' ద్వారా సమర్థవంతమైన పరిష్కారం చూపుతున్నామని వైద్యులు తెలిపారు. అలాగే, గర్భాశయ సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడే లాపరోస్కోపీ విధానం ద్వారా అతి తక్కువ కోతతో, త్వరగా కోలుకునేలా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మెరుగైన వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన సిబ్బందితో లీలావతి హాస్పిటల్స్ నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటుందని వారు వెల్లడించారు.
COMMENTS