ఎడ్లపాడు: 18 సంవత్సరాల లోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలకు నిందితులకు పడే కఠిన శిక్షలు, సంబంధిత చట్ట సెక్షన్లు తద్దంతో పిల్లలపై ల...
ఎడ్లపాడు: 18 సంవత్సరాల లోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలకు నిందితులకు పడే కఠిన శిక్షలు, సంబంధిత చట్ట సెక్షన్లు తద్దంతో పిల్లలపై లైంగిక వేధింపుల విషయంలో పనిచేయడానికి అవసరమైన జోక్య నైపుణ్యాల గురించి మండల పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయం (MPDO)లో సైకాలజిస్ట్ డాక్టర్ సి.ఎచ్. శ్రీనివాసరావు వివరించారు.పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్) 2012 గురించి అవగాహన కల్పించిన ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో హేమలత ఆధ్వర్యంలో డాక్టర్ పి.భరద్వాజ్ నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, మహిళా పోలీస్ విభాగాలకు చట్ట విధి-విధానాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమానికి సిడిపిఓ జి. శాత కుమారి, హెల్త్ సూపర్వైజర్ లు వి. రాజశేఖర్, భారవి, ఏఎన్ఎం, ఎంఎల్ హెల్త్ పోస్ట్ ఇన్-ఛార్జ్‌లు, అంగన్వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS