చిలకలూరిపేట: వెద్య రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుబాటులోకి వస్తున్న అధునాతన వైద్య విధానాలతో రోగులకు వ్యాధి నుంచి ఉపశమనం ...
చిలకలూరిపేట:
వెద్య రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుబాటులోకి వస్తున్న అధునాతన వైద్య విధానాలతో రోగులకు వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే అందుబాటులో వస్తున్న అధునాతన వైద్య సేవలను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకొని మాతా,శిశువు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చిలకలూరిపేటలోని వరలక్ష్మి ఫెర్టిలిటీ& మెటర్నిటీ ఆసుపత్రి ప్రజల మన్ననలు పొందుతుంది. వైద్య చరిత్రలోనే అతి కిష్టమైన ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గరికపాటి వరలక్ష్మి తన వైద్య సేవల ద్వారా సమాధానం చెబుతున్నారు. సంక్లిష్ట శస్త్రచికిత్సలతో ఇప్పటికే అనేక మంది తల్లి, శిశువులను కాపాడుతున్న చరిత్ర డాక్టర్ గరికపాటి వరలక్ష్మికే దక్కుతుంది. వైద్య చరిత్రలో అతి కిష్టమైన శస్త్రచికిత్సలను అవలీలగా చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
అమ్మ అన్న పిలుపుకు చేరువవండి
మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఒక వరం లాంటిది. కానీ నేడు అనేక కారణాలతో దంపతులు పిల్లలు లేని సమస్యతో సతమతమవుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకప్పుడు సంతానలేమి సమస్య ఏడుశాతం మంది దంపతుల్లో ఉండగా, ఇప్పుడు ఆ సమస్య దంపతుల్లో రెట్టింపు అయినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యకు ఇప్పుడు పెద్ద నగరాలకు వెళ్ల అవసరం లేకుండా చిలకలూరిపేటలో అతి తక్కువ ఖర్చుతో వరలక్ష్మి ఫెర్టిలిటీ& మెటర్నిటీ ఆసుపత్రి మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సంతానలేమి సమస్యలతో బాడపడుతున్నట్లయితే డాక్టర్ వరలక్ష్మిని సంప్రదించండి. అమ్మ అన్న పిలుపుకు చేరువవండి.
దంపతులు జీవనశైలిని మార్చుకోవాలి... డాక్టర్ వరలక్ష్మి,ఆసుపత్రి వైద్యురాలు
ఈ సందర్బంగా డాక్టర్ గరికపాటి వరలక్ష్మి మాట్లాడుతూ సంతానలేమి సమస్య ఉన్నవారు తమ జీవనశైలిని మార్చుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ, వ్యాయామం వంటివి చేయాలని, లోపం ఎవరిలో ఉందో గుర్తించి, దానిని అధిగమించేందుకు ప్రయత్నించాలన్నారు. జీవితంలో ప్రతి జంటకు సంతానం ఒక కలని, అయితే దీని గురించి బయట చర్చించేందుకు, వైద్యులను సంప్రదించేందుకు అనేక మంది వెనకాడతారని తెలిపారు. . సమస్యను త్వరగా గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించడం ద్వారా తమ కలను నెరవేర్చుకోవచ్చుని, సంతాన లేమికి మహిళలు, పురుషుల్లో సమస్యలు ఉండవచ్చున్నారు. సంతాన లేమి సమస్యతో బాధపడే వారికి తమ ఆసుపత్రిలోనే అధునాతన పరీక్షలు, యంత్రాలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.
-----------------------


COMMENTS