దేశమంతటా.. త్రివర్ణ పతాక రెపరెపలు!

  • Sharebar


దేశవ్యాప్తంగా 66వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు ఆయన మహాత్మాగాంధీ సమాధి ఉన్న రాజ్‌ఘాట్‌‌కు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం గట్టి భద్రత మధ్య ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ, రక్షణ శాఖ సహాయమంత్రి పళ్ళం రాజులు స్వాగతం పలికారు. అక్కడ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని.. ఎర్రకోటపై వరుసగా తొమ్మిదో సారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు నిఘా వర్గాలు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గగనతలం నుంచి సైతం భద్రతను పర్యవేక్షించారు.

Comments

comments

Powered By Indic IME