
న్యూఢిల్లీ: నజఫ్‌ఘర్ స్వతంత్ర శాసనసభ్యుడు భరత్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శాసనసభ్యుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కార్యాలయానికి అతి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సింగ్‌కు రెండు బుల్లెట్ గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. ఈ దాడికి వ్యక్తిగత కక్షలే కారణమని భావిస్తున్నారు.
భరత్ సింగ్ ఎంసిడి కౌన్సిలర్, గ్యాంగ్‌స్టర్ కిషన్ పెహల్వాన్ సోదరుడు. ఇతనిపై పలు కేసులున్నాయి. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి కూడా ఈ సంఘటనలో గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ఎమ్మెల్యేపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
దాడి చేసిన ఐదుగురిలో నలుగురు వ్యక్తులు శాసనసభ్యుడిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. శానససభ్యుడిని గాయపడిన వ్యక్తిని సమీపంలోని మాతా చనన్ దేవి ఆస్పత్రిలో చేర్చారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు. సంఘటనలో గాయపడిన వ్యక్తిని ధర్మపాల్‌గా గుర్తించారు.






Comments