కొచ్చిన్: రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అజిత్ అంటోనీ సినీ రంగం ప్రవేశం చేస్తున్నారు. ఓబెరాయ్ చిత్రంతో ఆయన సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మాణవుతోంది. అజి జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 22 ఏళ్ల అజిత్ ఆంటోనీ చిన్న కుమారుడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆయన ఆంగ్ల సాహిత్యం చదివారు. మలయాళం వెర్షన్ సినిమా సంభాషణలను అనూప్ మీనన్ రాశారు. కథను అజితే రాశాడు. దాంతో ఫొటో సెషన్ గోవాలో జరిగింది. వ్యాపారంలో ప్రత్యర్థులైన ఇద్దరు ఉత్తర భారత వ్యాపారులకు సంబంధించన కథ ఇది. అజిత్ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని జాన్ చెబుతున్నాడు.






Comments