జర్దారీతో భేటీకి ఒబామా నిరాకరణ

  • Sharebar


పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో సమావేశమయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరాకరించారు. ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ తీవ్రవాదులపై పోరు చేస్తున్న నాటో దళాలకు మందుగుండు సామాగ్రిని చేరవేసేందుకు అవసరమైన మార్గాలను పాకిస్థాన్ మూసి వేయడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.

నాటో దళానికి చెందిన వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా మూసివేసిన రహదారులను తిరిగి ప్రారంభంచాలని అమెరికా పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే, అమెరికా విజ్ఞప్తిని పాకిస్థాన్ తోసిపుచ్చింది. గత ఏడాది నవంబరు నెలలో ఆప్ఘన్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని పాక్ ఆర్మీ చెక్‌పోస్టుపై నాటో దళాలు జరిపిన దాడిలో పాకిస్థాన్ సైనికులు 24 మంది మరణించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

Comments

comments

Powered By Indic IME