మాల్దీవుల్లో మళ్లీ రభస – నషీద్ సోదరుడు అరెస్టు!

  • Sharebar

మాల్దీవుల్లో మళ్లీ రభస ఆరంభమైంది. మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పార్టీకి చెందిన సభ్యులు, పార్లమెంట్ వెలుపలా, బయట రభస సృష్టించారు. దేశ కొత్త అధ్యక్షుడు వహీద్ తన పదవికి రాజీనామా చేయాలంటూ వారు నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పార్లమెంట్‌లో దేశాధ్యక్షుడి కుర్చీని నషీద్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు లాగివేశారు. ఈ చర్యకు పాల్పడినందుకు నషీద్ సోదరుడు నాజిమ్ సత్తార్ సహా 14 మందిని అరెస్టు చేశారు. కొత్త అధ్యక్షుడు పార్లమెంట్‌కు రాకముందే సభలోకి ప్రవేశించిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ)కి చెందిన సభ్యులు అధ్యక్ష కుర్చీని లాగిపారేసి, స్పీకర్ బెంచిపై బైఠాయించారు. తక్షణం వహీద్ తన పదవికి రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎండీపీ సభ్యుల ఆగడాలను కొత్త సర్కారుకు మద్దతుదారులైన వారి దుకారణాల్లోకి చొరవడి విధ్వంసకాండకు పాల్పడ్డారు. పరస్పర ఘర్షణల్లో పలువురు పోలీసులు, ఆందోళనకారులు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమగా ఉంది.

Comments

comments

Powered By Indic IME