ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో పాటు… ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత యులియా టైమోషెంకోలు ఉన్నారు. ఈయన ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. వీరిద్దరే కాకుండా మొత్తం 188 వ్యక్తులతో సహా 43 సంస్థలు జాబితాలో ఉన్నట్టు నోబెల్ ఇనిస్టిట్యూట్ అధిపతి గెయిర్ లున్డెస్తాద్ వెల్లడించారు. ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతికి మొత్తం 231 మంది పోటీ పడుతున్నట్టు గెయిర్ చెప్పారు. వీరిలో బిల్ క్లింటన్ తో సహా టైమోషెంకో, జర్మనీ మాజీ ఛాన్సరల్ కోహ్ల్, అమెరికా సైన్యానికి చెందిన రహస్య పత్రాలను పెద్దమొత్తంలో వికీలీక్స్ వెబ్సైట్కు అందజేశారనే అభియోగాలపై జైలుపాలైన ఆ దేశ సైనికుడు మనింగ్ కూడా ఉన్నట్టు వివరించారు.






Comments