భారతీయ చిన్నారుల అప్పగింత విషయమై నెలకొన్న వివాదంలో ఎట్టకేలకు భారత్ దౌత్య విజయం సాధించింది. భారతీయ దంపతులు అనూప్, సాగరిక భట్టాచార్యల పిల్లలను వారి బాబాయికి అరుణభష్ భట్టాచార్యకు అప్పగించాలని శిశు సంక్షేమ అధికారులను నార్వే ప్రభుత్వం ఆదేశించింది. సంరక్షణ విషయమై వివాదం కారణంగా భట్టాచార్య దంపతుల సంతతి ఏడాది ఐశ్వర్య, మూడేళ్ళ అభిజ్ఞాన్లను నార్వే శిశు సంక్షేమ అదికారులు తమ అధీనంలోఉంచుకుది. ఈ వివాదంపై మార్చి 23న నార్వే కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. శిశు సంక్షేమ అధికారుల సిఫారసులకు భిన్నంగా నడుచుకునేందుకు నార్వే ప్రభుత్వం విముఖతతో ఉందని భట్టాచార్య తరపు న్యాయవాది స్వెండ్సన్ మీడియాకు తెలిపారు. నార్వే చేరిన భారత ప్రతినిధి మధుసూదన గణపతి, నార్వే విదేశాంగ మంత్రితో సవివరంగా చర్చలు జరిపారు..






Comments