
రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఓటర్లకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గురువారం వైఎస్ విజయమ్మతో కలిసి విశాఖ జిల్లా కోటవురట్ల,తూర్పుగోదవరి జిల్లా దాక్షారామం బహిరంగ సభల్లో మాట్లాడారు.
జగన్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైఎస్ కుటుంబంపై కక్ష సాధిస్తున్నాయని షర్మిల ఆరోపించారు. జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టారని ఆమె అన్నారు. రాజకీయాలంటే ఇంత నీచంగా ఉంటాయా అని షర్మిల ఈ సందర్భంగా ప్రశ్నించారు.
వైఎస్ చలువతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. చివరకు ఆ వైఎస్ కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే సమయంలో ఆసన్నమైందన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటుతో కాంగ్రెస్, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.






Comments