
ఉప ఎన్నికల్లోనే కాకుండా, ఇప్పటి జరిగిన దేశ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంతడు తెలుగుదేశం పార్టీకి చెందిన దీపక్ రెడ్డి. అవినీతిపై పోరాటం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయం తెలియదనుకోవడ్ం పొరపాటు.
జగన్ అవినీతికి పాల్పడినట్టు చంద్రబాబు కాలికిబలపం కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్న సమయంలో దేశంలోనే అత్యంత ధనికిడైన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జి.దీపక్ రెడ్డిని చంద్రబాబు నాయుడు బరిలోకి దించారు. ఈయన ఎన్నికల సంఘానికి నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లపై చిలుకుగా పేర్కొన్నారు.
అదేసమయంలో దీపక్ రెడ్డికి బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కేవలం లక్షన్నర రూపాయలుగా పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల్లో 90 శాతం పైగా న్యాయపరమైన వివాదాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొని ఎన్నికల సంఘం అధికారులు నివ్వెర పోయేలా ఇవ్వడం కొత్త ట్విస్ట్. ఎంతైనా.. బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యూయేట్ తెలివితేటలు కదా.
గ్రేట్ ఇండియన్ మైనింగ్, గ్రేట్ ఇండియా రాక్ మినరల్స్ యజమానిగా దీపక్ రెడ్డి కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ.ప్రతాప్ రెడ్డికి సొంత అల్లుడు. అయితే ఆశ్చర్యంగా దీపక్ రెడ్డి సంవత్సర ఆదాయం రూ.3.27 లక్షలుగా చూపారు.






Comments