ఆ లాయర్లపై చర్యలేవీ… సుప్రీం సూటిప్రశ్న?

  • Sharebar


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భగంగా 2011 లో సకలజనుల సమ్మె సందర్భంగా రాష్ట్ర హైకోర్టు వద్ద కొందరు న్యాయవాదులు చేసిన విధ్వంసంపై సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో విధ్వంసానికి పాల్పడి, లోపలికి చొచ్చుకుని దాడికి తెగించిన న్యాయవాదులపై రాజకీయ నాయకులు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ మండిపడింది.

ఎవరైతే విధ్వంసానికి పాల్పడ్డారో ఆ న్యాయవాదుల లైసెన్సులను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. ఇటువంటి సంఘటనలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు ఎందుకంటూ ప్రశ్నించింది. సకలజనుల సమ్మె కాలంలో న్యాయవాదులు చేసిన బీభత్సంపై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని కృష్ణయ్య అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.

Comments

comments

Powered By Indic IME