
జీవితం విలువైనది. జీవన యాత్రకు లక్ష్యం ఆత్మహత్య కానేకాదు. భావోగ్వేదాలు సహజం.
అయినా బతుకును బుగ్గిపాలు చేసే సాహసానికి ఒడిగట్టడం ఎంతమాత్రం సమంజసం కాదు.
బలిదానాలతో మన లక్ష్యం నేరవేరుతు౦దనుకోవడం పొరపాటు. అదే నిజమైతే..
ఇంతకు ముందు తమను తాము దహించుకున్న వారి అంతిమ లక్ష్యం ఎప్పుడో నెరవేరి ఉండాల్సింది.
తెలంగాణ ఏర్పడి ఉండాల్సింది. కానీ అది జరగలేదంటే పాలకులు..
నాయకుల కుయుక్తులే కారణమని అర్థం అవుతోంది. ఎవరి రాజకీయ లక్ష్యాలు వారివి.
ఉద్యమాన్ని రగిల్చిన వారు ఇప్పుడు నిస్సహాయంగా కనిపించవచ్చు.
ఉద్యమానికి ఊతమిచ్చినవారు నిస్తేజంగా మారిపోవచ్చు. ఉద్యమ స్ఫూర్తి ఈనాటిది కాదని గుర్తించాలి.
ఆరు దశాబ్దాల ఆక్రోశానికి తెలంగాణ ఉద్యమం ఓ ప్రతీక. నివురుగప్పిన నిప్పులాంటిది తెలంగాణ ఉద్యమం.
కొందరు స్వార్ధపరుల అధికార దాహానికి అప్పుడప్పుడూ తెలంగాణ సమిధ అవుతోంది. పదవులకోసమో..
పాపపు సంపాదన కోసమో తెలంగాణను నిస్సిగ్గుగా వినియోగించుకుంటున్న దగాకోరులను వదిలేద్దాం.
నిస్వార్ధంగా తెలంగాణ కోసం పోరాడుతున్న యోధులకు వీరతిలకం దిద్ది వెంట నడుద్దాం. అయితే..
ఇక్కడో కీలకాంశాన్ని గమనించాలి. రాష్ట్ర విభజన అనుకున్నంత సులువైన పని కానేకాదు.
అందికే ఒకింత జాప్యం జరుగుతోంది. జాప్యానికి కారణాలు అనేకం.
జనంలో ఉద్యమ ఉగ్వేదాలను చల్లబరచాలని కేంద్రం భావిస్తు౦డవచ్చు.
తెలంగాణ ఇస్తే దేశంలోని మరికొన్ని ప్రాంతాలవారు ప్రత్యెక రాష్ట్రాలు కోరతారని భయపడుతు౦డవచ్చు.
లేదా నిఘా వర్గాల నివేదికలు మరోరకంగా ఉండి ఉండవచ్చు.
ఏదిఎమైనా పోరాటయోధుని అంతిమ లక్ష్యం ఆత్మహత్య కాకూడదు.
విలువైన్ భవిష్యత్తున్న యువకులు చనిపోతే..రానున్న తెలంగాణ ఎవరికోసం..?
ఫలాలను ఎవరు అనిభావించాలి. నిన్నటిదాకా కలలుకన్న తెలంగాణ రేపటి స్వప్నంగా
మారిపోవడానికి బలిదానాలు ఉపయోగపడకూడదు. బలవన్మరణం ఎప్పుడూ దుఖాన్ని మిగులుస్తుందే తప్ప శోకాన్ని నివారించలేదు. కొత్త సమస్యల్ని సృష్టిసుంది కూడా! అందుకే భావోగ్వేదాలను పక్కన పెడదాం.. బంగారు భావితకోసం పోరాడదాం…!!
-శివరాం






Comments