
పరకాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆ పార్టీకి చెందిన భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. అపుడే కాంగ్రెస్ అధినాయకత్వం మేల్కొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తగిన చర్యలు చేపడుతుదని ఆయన చెప్పారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోవటం వల్లనే కాంగ్రెస్ పార్టీ వరుస ఓటముల పాలౌతుందన్నారు. పరకాలో కూడా కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఢిల్లీల ఉన్న అధిష్టానం కదులుతుందని ఆయన జోస్యం చెప్పారు. పరకాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని స్థానిక వర్గాల సమాచారంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.






Comments