నెల రోజుల్లో జగన్ జైలుకు..: లగడపాటి

  • Sharebar


అక్రమాస్తుల కేసులలో నెల రోజుల్లో కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళడం ఖాయమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై అభియోగాలు మోపారంటూ మొదట్లో జగన్ తన మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నాడని విమర్శించారు. కానీ వాస్తవాలు ఏమిటో తాజా విచారణలో ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయని అన్నారు. ముడుపులు చెల్లించిన వారే జగన్‌కు ఎంత కప్పం కట్టారో చెప్పడంతో ఆయన నిజస్వరూపం బయటపడుతోందన్నారు.

మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా రూ.800 కోట్లు, ఇతరుల ద్వారా కలిపి మొత్తం రూ.2 వేల కోట్లు అక్రమంగా జగన్ స్వాహా చేసినట్టు ఇప్పటికే సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో జగన్‌ను అరెస్టు చేయాలంటూ ప్రజలే స్వచ్చంధంగా డిమాండ్ చేస్తున్నారని లగడపాటి చెప్పుకొచ్చారు.

Comments

comments

Powered By Indic IME