తెలంగాణ భూముల్నిదోచిపెట్టింది బాబే.. కేటీఆర్!

  • Sharebar


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిలపై తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. వైఎస్సార్ రంగారెడ్డి జిల్లా భూములను కొల్లగొట్టి తన తనయుడు జగన్మోహన్ రెడ్డి జేబులు నింపారని మండిపడ్డారు.

అలాగే తెలంగాణ భూములను ఆంధ్రా వాళ్ళకు కట్టబెట్టడం ప్రారంభించింది.. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. వైఎస్సార్ ఈ సంస్కృతిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. భూముల వేలం ద్వారా వచ్చిన సొమ్మును వైయస్ ఆంధ్రా నేతలకు కట్టబెట్టాడన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక విచారణ కమిటీ వేసి భూములను స్వాధీనం చేసుకొని తిరిగి రైతులకు అప్పగిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లా భూముల వేలాన్ని నిరసిస్తూ కెటిఆర్ ఆధ్వర్యంలో తెరాస తార్నాకలోని హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించింది. కార్యకర్తలు కార్యాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా భూముల వేలం పాటను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో హెచ్ఎండియే మట్టికొట్టిందని, వేలంపాట భూములు అన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులవి అన్నారు.

Comments

comments

Powered By Indic IME