
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపట్ల పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాన్‌పిక్ భూముల కేటాయింపు వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో నాటి వైఎస్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాద రావు పేరును చేర్చిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన అనంతరం ధర్మాన పీసీసీ చీఫ్‌తో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స.. తనలోని అసంతృప్తిని ధర్మాన వద్ద వెళ్లగక్కినట్టు చెబుతున్నారు. సీఎం అనుసరిస్తున్న వైఖరి పార్టీకి, నేతలకు చెడ్డపేరు తెచ్చిపెట్టడమే కాకుండా అప్రతిష్టపాలు చేసేలా ఉందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనతో ఒక మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని ఇప్పటి వరకు చర్చించక పోవడం పట్ల బొత్స తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని బొత్స భావిస్తున్నట్టు తెలుస్తోంది.






Comments