జగన్‌ టార్గెట్.. క్యాబినెట్ ఫట్..!

  • Sharebar


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడంతో పాటు.. రాజకీయాల్లో వ్యక్తిగతంగా నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన చర్యలు బెడిసి కొడుతున్నాయి. ముఖ్యంగా.. వైఎస్ఆర్ సీపీతోపాటు ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి పి.శంకర్రావుతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర హైకోర్టుకు రాయించిన లేఖ ఇపుడు సొంత పార్టీనే ఓ కుదుపుకుదుపుతోంది.

శంకర్రావు లేఖతో కోర్టు వైయస్ జగన్ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ దర్యాప్తు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు.. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని సీనియర్ సభ్యుల మెడకూ చుట్టుకుంది. ఇందులోభాగంగా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ చంచల్‌గూడ జైలు పాలయ్యారు.

తాజాగా మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిక్కుల్లో పడ్డారు. ఫలితంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈయన్ను కూడా సీబీఐ ఎపుడైనా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. మరో నలుగురైదుగురు మంత్రులు సుప్రీంకోర్టు నోటీసులు ఎదుర్కొంటున్నారు. దీంతో తన పదవితో పాటు. తన మంత్రివర్గాన్ని ఏవిధంగా కాపాడుకోవాలన్న సందిగ్ధావస్థలో కిరణ్ కొట్టుమిట్టాడుతున్నారు.

సుప్రీం నోటీసులు అందుకున్న మంత్రుల్లో సీనియర్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జె.గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణలు ఉన్నారు. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. ఇద్దరి విషయం తేలిపోగా మిగతా నలుగురు కూడా చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వారిని ఎలా కాపాడాలో తెలియక కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళనలో ఉన్నారు.

Comments

comments

Powered By Indic IME