జగన్ ను కలిసిన రాంజెఠ్మలానీ

  • Sharebar


హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైల్లో గురువారం ఉదయం ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, ఆడిటర్ విజయ సాయిరెడ్డి కలిశారు. అనంతరం రాంజెఠ్మలానీ మీడియాతో మాట్లాడుతూ జగన్తో కేసు విషయాలు చర్చించినట్లు తెలిపారు.

శిక్షపడ్డ ఖైదీకి కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులుంటాయని రాంజెఠ్మలానీ అన్నారు. రిమాండ్లో ఉన్న జగన్ హక్కులను ప్రభుత్వం హరించిందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మీడియా, ప్రభుత్వం, అందరూ గమనించాల్సిన విషయమన్నారు.

Comments

comments

Powered By Indic IME