
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌నునాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో 25వ తేదీన జగన్ అరెస్టుకు రంగం సిధ్దమైనట్టు అర్ధమవుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్త తమ ఎదుట హాజరుకావాలంటూ సీబీఐ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ ఆస్తుల కేసుతో పాటు.. వాన్‌పిక్ భూముల కేటాయింపుల వ్యవహారంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో జగన్ అరెస్టు తప్పదన్న సంకేతాలు తేటతెల్లమయ్యాయి.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల దృష్ట్యా, తనకు అండగా నిలబడిన 18 మంది అభ్యర్థుల తరపున ఓ పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేసేందుకు తనకు కొంత సమయం కావాలంటూ జగన్ సీబీఐను గడువు కోరారు. దీనికి సీబీఐ అంగీకరించక పోవడంతో జగన్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.






Comments