ప్రశ్నలడిగింది.. వివరణలు ఇచ్చాను.. జగన్..!

  • Sharebar


వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకూ ప్రశ్నించింది. ఆరున్నర తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నారు. పొద్దుటి నుంచి నర్రలుతెగే ఉత్కంఠకు గురైన అనేక మంది అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దిల్ కుశ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన జగన్ మీడియాతో ఒకటి రెండు నిముషాలు మాట్లాడారు. సిబిఐ అడిగిన ప్రశ్నలకు తాను వివరణ ఇచ్చానని.., మళ్ళీ రేపు రమ్మన్నారని తెలిపి జగన్ వెళ్ళిపోయారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు మరింత ఉద్విజ్ఞభరితులవుతున్నారు. శనివారం అరెస్ట్ చేస్తారేమో నని భయపడుతున్నారు.

Comments

comments

Powered By Indic IME