హంపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 21మంది మృతి

  • Sharebar


అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలో హంపీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 21మంది సజీవదహనమయ్యారు. మరో 75 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. హంపి నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ రైలు పెనుగొండ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉదయం 3.40గంటలకు ప్రమాదానికి గురైంది. పెనుకొండలో ఆగి ఉన్నగూడ్స్ ను హంపి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఈ ప్రమదం జరిగింది. ఇంజన్‌ వెనుక ఉన్న బోగీలు ఒకదానిపై ఒకటి పడటంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. తేరుకునే లోపే 21 మంది సజీవ దహనమయ్యారు. మరణించినవారిలో ఎక్కువమంది మహిళలు. తప్పించుకునేందుకు మరికొందరు ప్రయత్నించినా తలుపులు తెరుచుకోలేదు.

స్థానికులు, రైల్వే సిబ్బంది రావడంతో క్షతగాత్రులను అనంతపురం, హిందూపురం, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పెనుగొండ ఆర్డీవో, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పగా.. ఇందులో రెండు బోగీలకు వెంటనే మంటలు అంటుకున్నాయి. బోగీల్లోనుంచి ప్రయాణికులు బయటపడేందుకు తలుపులు తెరుచుకోకపోవడంతో రైలులోనే ఆర్తనాదాలు చేస్తున్నారు. సహాయక సిబ్బంది కట్టర్ల సాయంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలికి బెంగళూరు, గుంతకల్, ధర్మవరంల నుంచి రెస్క్యూ టీమ్స్‌ చేరుకుంటున్నాయి.

రష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, సైలజానథ్, ఎంపి చిరంజీవి, జిల్లా ఉన్నాతాధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవెక్షిస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రులు, ఇతర రైల్వే ఉనాతాధికారులు కూడా పెనుకొండ చేరుకుని దుర్ఘటనను సమీక్షించారు.

Comments

comments

Powered By Indic IME