
‘ది డర్టీపిక్చర్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళ రీమేక్ కోసం ఏక్తా విశ్వప్రయత్నాలు చేస్తోంది. అది తెలుగు నటి జీవిత చరిత్ర అయినా బాలీవుడ్ జనాలు దాన్ని తెగ ఆదరించేశారు. అందుకే మిగిలిన భాషల్లోనూ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఏక్తా..దక్షిణాది తారలైన అనుష్క, నయనతారలను అనుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. ఏక్తాకపూర్ చేస్తున్న ప్రయత్నాల్లో వాస్తవంలేదని నయనతార, అనుష్కలు చెబుతున్నారు.
అయితే.. నయనతారకు సంప్రదించిందనీ, ఆమె కోరినంత ఇస్తానని చెప్పిందని వార్తలు వచ్చాయి. దాన్ని నయనతార ఖండించింది. తనతో ఆ చిత్రం గురించి ఎవరూ సంప్రదించలేదనీ, దానికోసం కాస్త లావుకూడా పెరగాలని చెప్పిన వార్తల్లో నిజంలేదని అంది. ప్రస్తుతం నయనతార, గోపీచంద్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అనుష్కనైనా ఈ చిత్రానికి తీసుకోవాలని ఏక్తాకపూర్ అనుకుందట. అనుష్కమాత్రం చేయనని బల్లగుద్ది చెబుతోంది. మరి ఆ పాత్రకు ఎవర్ని ఎంపికచేస్తుందో చూడాలి.






Comments