
ఉప ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగుతాయనగా జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లడం, విజయమ్మ, షర్మిళ కన్నీళ్లు పెట్టడం వల్లనే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబునయుడు అన్నారు. ఏదేమైనప్పటికీ కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఉప ఎన్నికల్లో తెదేపా ఖాతా తెరవకపోవడమే కాక పలుచోట్ల డిపాజిట్లు కూడా గల్లంతవడంపై ప్రశ్నించినపుడు… పూర్తిగా గణాంకాలు తెప్పించుకుని విశ్లేషణ జరిపాక ఆమేరకు తమపార్టీ ముందుకు పోతుందని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై ఇప్పుడు మాట్లాడటం కాదనీ, ఆయన తండ్రి ఉన్నప్పుడే కేంద్రానికి ఒక నివేదికను ఇచ్చామని గుర్తు చేశారు.
ఆనాడు కేంద్రం స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అవినీతి, అక్రమాలు చేసిన జగన్ మోహన్ రెడ్డికి సెంటిమెంటు కలిసివచ్చేసరికి ఎన్నికల్లో ఫలితాలు వారికి అనుకూలంగా మారాయన్నారు.






Comments