ధర్మాన అరెస్టు ఖాయమంటున్న న్యాయ నిపుణులు!

  • Sharebar


వాన్‌పిక్ సంస్థకు ప్రభుత్వ భూములను ధారరాదత్తం చేసిన వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు అరెస్టు తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాన్‌పిక్‌ భూముల కేటాయింపు విషయంలో కొందరికి లభ్ది చేకూరేలా జీవోలు జారీ చేసినట్టు అభియోగం మోపుతూ సీబీఐ నాంపల్లి సీబీఐ కోర్టులో అభియోగ పత్రం సమర్పించి వారం దాటింది.

దీనిపై న్యాయ నిపుణులు స్పందిస్తూ ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్న చార్జి షీట్‌కు ఆమోదం లభించగానే ఆయనతో పాటు నిందితులుగా పేర్కొన్న ఐఏఎస్‌ అధికారులు మన్మోహన్‌సింగ్‌, శామ్యూల్‌లను కూడా అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేయవచ్చని పేర్కొన్నారు.

అయితే నిబంధనల ప్రకారం ఐఏఎస్‌ అధికారులను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో అధికారుల అరెస్ట్‌కు కొంతసమయం పట్టినా ధర్మాన అరెస్ట్‌ మాత్రం వెంటనే జరిగిపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌కు భూముల కేటాయింపులు, అందుకు సంబంధించి ఒప్పందాల విషయంలో ధర్మాన ప్రసాద రావు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో ఎనిమిది వివాదాస్పద జీవోలు జారీ చేసినట్టు సీబీఐ తన చార్జిషీట్‌లో ఆరోపించింది.

Comments

comments

Powered By Indic IME