రామ్ చరణ్ తాజా చిత్రం ‘రచ్చ’బిజినెస్ విషయంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘రచ్చ’ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.2.7 కోట్ల భారీ మొత్తానికి నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పరస్ జైన్ ఈ హక్కులు విక్రయించినట్లు తెలిసింది. మార్చి 4వ తేదీన కర్నూల్‌లో ‘రచ్చ’ ఆడియోను విడుదల చేయాలని నిర్ణయించారు. జూన్‌లో చెర్రీ వివాహానంతరం అభిమానులకు కర్నూల్‌లో విందు ఇవ్వబోతున్నందున, కర్నూల్ ‘రచ్చ’ ఆడియో విడుదల వేదికయింది. తమన్నా, చరణ్‌ల ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చిన టైటిల్ ట్రాక్ ఇప్పటికే యూట్యూబ్‌లో ఉర్రూతలూగిస్తోంది.






Comments